19 August, 2026 | 3:40 AM

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్

19-08-2026 01:13 AM

*మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి

ఘట్‌కేసర్, ఆగస్టు 18 (విజయక్రాంతి): సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి అన్నారు. ఘట్ కేసర్ గౌడ సంఘం అధ్యక్షులు మదనగిరి సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని ఘట్ కేసర్ పట్టణ కేంద్రం బైపాస్ రోడ్డు చౌరస్తాలో ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనియాడారు. పేదల కోసం ఆయన చేసిన త్యాగాలు, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమం నేటి తరానికి ఆదర్శమన్నారు. పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని పలువురు నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్, సార శ్రీనివాస్ గౌడ్, మామిండ్ల ముత్యాల్ యాదవ్, మారం లక్ష్మారెడ్డి, మేకల నర్సింగ్ రావు, కొంతం అంజిరెడ్డి, బొక్క ప్రభాకర్ రెడ్డి, రేసు లక్ష్మారెడ్డి, కొమ్మిడి మహిపాల్ రెడ్డి, చింతల యాదయ్య, రాజబోయిన యాదగిరి యాదవ్, బేతాళ నర్సింగరావు, బండారి ఆంజనేయులుగౌడ్, బొక్క సంజీవరెడ్డి, వెంకట్ రావుగౌడ్, లగోని రమేష్ గౌడ్, బండారి జగదీశ్వర్ గౌడ్, బండ్లగూడ కిశోర్ గౌడ్, బీగూడెం పాండుగౌడ్, రాగిరు మల్లేష్ గౌడ్, నంబియార్ గౌడ్, కృష్ణ గౌడ్,  రాంపల్లి జగదీష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.