పదేళ్లలో దివ్యాంగులకు ఏం చేశారో బీఆర్ఎస్ చెప్పాలి?
పదేళ్లు అధికారంలో ఉండి ఏ చేశారు?
దివ్యాంగుల సంక్షేమానికి రూ. 50 కోట్లు ఖర్చు చేశాం
పదేళ్లలో దివ్యాంగులకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి?
హైదరాబాద్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై(BRS Government) తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గాంధీభవన్(Gandhi Bhavan)లో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. అమలు చేశారా? పదేళ్లలో దివ్యాంగులకు ఏం చేశారో బీఆర్ఎస్ చెప్పాలి?, పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు? అని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) దివ్యాంగులకు బ్యాటరీ వీల్ ఛైర్లు, వాహనాలు అందించినట్లు తెలిపారు.
దివ్యాంగుల సంక్షేమానికి రూ. 50 కోట్లు ఖర్చు పెట్టామని, 34 జీవో తీసుకొచ్చి దివ్యాంగులకు ప్రయోజనం చేకూర్చామని స్పష్టం చేశారు. ఇంకా మిగిలినవారికి కూడా సంక్షేమం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దివ్యాంగ దంపతులు ఒకేచోట పనిచేసేలా సవరణ చేశామని తెలిపారు. అర్హత ఉన్న దివ్యాంగులందరికీ కొత్త పింఛన్లు ఇచ్చామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్పారు. పుట్టిన వెంటనే అంగవైకల్యం ఉంటే బాల్ భరోసా(Bal Bharosa Scheme) కింద పథకం తీసుకొచ్చామన్నారు. అంగవైకల్యం ఉన్న పిల్లలకు అవసరమైన పరికరాలు అందిస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Minister Adluri Lakshman) వెల్లడించారు.






