30 August, 2026 | 2:42 PM

ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల వేలం

30-08-2026 01:15 PM

భూపాలపల్లి, ఆగస్టు 30 (విజయక్రాంతి): భూపాలపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఆగస్టు 31న వేలం వేయనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ రమ్య తెలిపారు. భూపాలపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో మధ్యాహ్నం ఒంటి గంటకు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సమక్షంలో వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

వేలంలో పాల్గొనేవారు వాహనాల కనీస ధరలో 50 శాతం ధరావత్తు చెల్లించాలి. వేలంలో వాహనం దక్కించుకున్న వారు అదే రోజు మిగిలిన మొత్తాన్ని చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలి. స్క్రాప్ వాహనాలను కట్ చేసి మాత్రమే తరలించాల్సి ఉంటుందని, వేలంలో వాహనం పొందిన వారు వర్తించే జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.