నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్: ఎస్సై మహేంద్ర
30-08-2026 01:18 PM
వాంకిడి,(విజయక్రాంతి): ప్రజల, పోలీసుల మధ్య సమన్వయం పెంపొందించి నేరాలను అరికట్టడమే పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వాంకిడి ఎస్ఐ మహేందర్ అన్నారు. ఆదివారం వాంకిడి మండలంలోని, నార్లాపూర్ గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలు తమ పరిసరాల్లో జరిగే అనుమానస్పద ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరాలు, మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, ఓటిపీలు , బ్యాంకు వివరాలు ఎవరికి ఇవ్వద్దని గ్రామ ప్రజలకు హెచ్చరించారు. వాహనదారులు అన్ని పత్రాలు కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






