బీఎల్‌ఎని పరామర్శించిన సర్పంచ్ వినోద్
01-08-2026 12:08 AM
ములకలపల్లి, జూలై 31 (విజయక్రాంతి): ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో 18వ బూత్ కాంగ్రెస్ పార్టీ బి ఎల్ ఏ షేక్ జానీని శుక్రవారం సర్పంచ్ వినోద్, ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ బిఎల్‌ఎ మండల కోఆర్డినేటర్ సురభి రాజేష్ పరామర్శించారు. అనారోగ్యానికి గురైన జానీ ని మెరుగైన వైద్యం అవసరమైతే సంప్రదించాలని సూచించారు.
అదేవిధంగా అనారోగ్యానికి గురైన జానీకి బిఎల్‌ఏ ఐడెంటి కార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ ములకలపల్లి మండల అధ్యక్షుడు గుంటూరు సాయిరాం, 19వ బూత్ బిఎల్ఏ రామాచారి, కాంగ్రెస్ నాయకుడు కూరం రామకృష్ణ, జగన్నాధపురం సోషల్ మీడియా అధ్యక్షుడు పూనెం వెంకట్ రామకృష్ణ పాల్గొన్నారు.






