14 March, 2026 | 4:26 PM

మాసానిపల్లిలో శ్రీశక్తి భవన నిర్మాణ పనులను ప్రారంభించిన సర్పంచ్

14-03-2026 03:08 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని మాసానిపల్లి గ్రామంలో శ్రీశక్తి భవన నిర్మాణ పనులను శనివారం గ్రామ సర్పంచ్ పెద్ద పట్లోళ్ల సునంద కిషన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పెద్దపట్లల్ల సునంద కిషన్ రెడ్డి మాట్లాడుతూ... మహిళా సంఘాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ గ్రామానికి శ్రీశక్తి భవనం మంజూరు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎందుకంటే మహిళా సంఘాలకు సరైన భవనలు లేక ఆయా గ్రామాల్లో ప్రభుత్వ భవనాల్లో వారి యొక్క విధులను నిర్వహించుకుంటున్నారని

దీనిని గమనించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ గ్రామానికి శ్రీశక్తి భవనం మంజూరు చేయడం వలన మహిళా సంఘాలకు ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు మహిళా సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో మాసంపల్లి గ్రామంలో శ్రీశక్తి భవనం మంజూరు కావడం గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్దపట్ల సునంద కిషన్ రెడ్డి, ఉప సర్పంచ్ దుర్గావ్వ,పంచాయతీ కార్యదర్శి సుభాష్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.