1 July, 2026 | 11:26 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఉచిత కరాటే శిక్షణ శిబిరం ప్రారంభించిన సర్పంచ్ జీరెడ్డి మహేందర్

06-05-2026 05:58 PM

ధర్మపురి,(విజయ క్రాంతి): జీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామ సర్పంచ్ జీరెడ్డి మహేందర్ రెడ్డి ఉచిత కరాటే (కుంగ్ ఫూ) శిక్షణ కేంద్రాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. కరాటేపై ఆసక్తి ఉన్న పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేసవి కాలం సెలవు దృష్ట్యా 8 సంవత్సరాలు పైబడిన ఆడ, మగ పిల్లలకు ఆత్మరక్షణ కోసం ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సదావకాశాన్ని పిల్లలు ఉపయోగించుకోవాలని ఈ శిక్షణ తరగతులు 06.05.2026 నుండి 15.05.2026 వరకు కొనసాగుతాయనీ తెలిపారు. వేసవి సెలవుల దృష్ట్యా పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని, ఈ శిక్షణ సీనియర్ కరాటే మాస్టర్ రాజమల్లయ్య ద్వారా  ఇవ్వబడుతున్నట్లు సర్పంచ్ జీరెడ్డి మహేందర్ రెడ్డి తెలిపారు.