21 August, 2026 | 1:33 PM

కోటగుళ్ళలో భక్తుల కోలాహలం

21-08-2026 12:38 PM

శ్రావణ శుక్రవారం.. స్వామివారికి రుద్రాభిషేకం 

గణపురం,ఆగస్టు 21 (విజయ క్రాంతి): ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో సందడి నెలకొంది. శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు తరలివచ్చి స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వాయినాలు సమర్పించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారిని పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వరలక్ష్మీ వ్రతం శుక్రవారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు.