ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ప్రారంభించిన సర్పంచ్ డిఎల్పిఓ
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని జలాల్పూర్ గ్రామంలో లబ్ధిదారుల నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదవాడికి ఆర్థికంగా పైకి తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు.
ప్రజాప్రభుత్వం లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల నిధులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు సహాయాన్ని అందిస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఎల్లారెడ్డి డిఎల్పీవో సురేందర్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీవో ప్రభాకర్ చారి,గ్రామ కార్యదర్శి వెంకట్రాములు తదితరులు ఉన్నారు.




