పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం మరువలేనిది
* పాఠశాలకు ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ బౌకరణ
గరిడేపల్లి,(విజయక్రాంతి): పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని,వారి సహకారం మరువలేనిదని ప్రధానోపాధ్యాయులు బి.వెంకటేశ్వర్లు అన్నారు.మండలం లోని అప్పన్నపేట గ్రామంలో బుధవారం ప్రాథమిక పాఠశాల పాత అప్పన్న పేటలో లింగనబోయిన రామకృష్ణ, లింగనబోయిన సతీష్ కుమార్ జ్ఞాపకార్థం మాజీ సర్పంచ్ లింగబోయిన త్రిపురాంబ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాలకు 12,000 విలువైన ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా దాత త్రిపురాంబ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఇష్టపడి చదివి భవిష్యత్ తరాలకు బాసటగా నిలవాలని ఆమె కోరారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నందిపాటి కవితా జానయ్య ,పాఠశాల ఏఏపియస్ చైర్మన్ ఇంజమూరి గురవమ్మ,గ్రామ ఉప సర్పంచ్ మదర్, మాజీ సర్పంచులు ఎడపల్లి చంద్రారెడ్డి, తోకల రామాంజనేయులు, గుడుగుంట్ల బిక్షం, డాక్టర్ అఖిల్ కిషోర్, గ్రామ కార్యదర్శి ప్రేమలత, ఉపాధ్యాయులు సైదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు




