కన్నతల్లిని చంపి ఇంట్లో పాతిపెట్టిన కూతురు — 10 నెలల తర్వాత సికింద్రాబాద్ దారుణం వెలుగులోకి
హైదరాబాద్: తన ప్రేమ వ్యవహారానికి నిరాకరించిన కన్నతల్లిని కుమర్తెనే హత్య ప్రియుడితో కలిసి చేసిన దారుణ ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ దారుణ ఉదంతం 10 నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కుమార్తె ఇషికా, మౌంటీ రాజ్ పుత్ అనే అబ్బాయిని ప్రేమించింది. తన ప్రేమ వ్యవహారానికి తల్లి అంజూ(45) అడ్డుచెప్పడంతో కోపంతో రగిలిపోయిన ఇషికా ప్రియుడితో కలిసి హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టారు. దానిపై ఎవరికీ అనుమానం రాకుండా తన తల్లి, ఇంట్లోని బైక్ కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏడాది క్రితం ఫిర్యాదు చేయడంతో పోలీసు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎటువంటి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే ఈనెల 24వ తేదీన అంజూ పేరుతో ఉన్న స్కూటీని నిందితుడు మౌంటీ రాజ్ పుత్ విక్రయించేందుకు ప్రయత్నించారు. అది అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడిని అదుపులోకి తీసుకోని విచారించగా, అసలు విషయం బయటపడ్డింది. కన్నతల్లి అంజూను చిన్న కుమార్తె ఇషిక ప్రియుడితో కలిసి చంపి, ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.




