25 March, 2026 | 7:16 PM

ఆంగ్ల అభ్యాసంలో విద్యార్థి అగ్రస్థానం

25-03-2026 05:56 PM

వాంకిడి,(విజయక్రాంతి): ఆంగ్ల అభ్యాసంలో వాంకిడి మండలం చౌపన్ గూడ (Govt TW SLC) ఆశ్రమ పాఠశాలకు చెందిన మూడవ తరగతి విద్యార్థి సిడాం భీంరా వ్ అగ్రస్థానం పొందినట్లు పాఠ శాల ప్రధానోపాధ్యా యుడు మనోహర్ తెలిపారు. ఉట్నూ ర్ లో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాల అభివృద్ధి కోసం VIBHA సంస్థ నిర్వహించిన ELP (English Learning Program)లో వాంకిడి మండలం చౌపన్ గూడ గ్రామంలోని ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ లెర్నింగ్ సెంటర్ (Govt TW SLC) ఆశ్రమ పాఠశాలకు చెందిన మూడవ తరగతి విద్యార్థి సిడాం భీంరా వ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఫైనల్స్ లో ప్రథమ స్థానం సాధించాడు.

ఈ సందర్భంగా (ఐటిడిఎ) ఉట్నూర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ చేతులమీదుగా బుధవారం భీంరావ్‌కు ప్రథమ బహుమ తిగా సైకిల్, స్టడీ చైర్, స్టడీ మెటీరియల్ అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం కె. మనోహర్, ఉపా ధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థి ప్రతిభపై హెచ్‌ఎం కె. మనోహర్, సబ్జెక్ట్ టీచర్ ఆర్. రాజేష్ అభినందనలు తెలియ జేస్తూ, భవిష్యత్తులో మరింత ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షిం చారు. ఈ విజయంతో పాఠశా లకు మంచి పేరు తీసుకువ చ్చాడని పేర్కొన్నారు.