25 March, 2026 | 6:31 PM

జన్మదినాన వృద్ధాశ్రమానికి దానం

25-03-2026 04:38 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా పీకే ఓసి-2లో ఈపీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మడ్డి రాము–దివ్య దంపతుల కుమార్తె జోషిక జన్మదిన వేడుకలను బుధవారం అశ్వాపురంలోని ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమంలో సాదాసీదాగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారి అభిలాష మేరకు వారు సుమారు రూ.10 వేల విలువైన క్వింటాల్ బియ్యం మరియు నిత్యావసర వస్తువులను వృద్ధాశ్రమానికి అందజేశారు. చిన్నారి జోషికకు అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి సభ్యుడు ఎస్.డి. నాసర్ పాషా వృద్ధాశ్రమ నిర్వహణలో దాతల సహకారం ముఖ్యమని పేర్కొంటూ నిర్వాహకులు షేక్ షహనాజ్, మేహరాజ్ దంపతులను అభినందించారు. కార్యక్రమంలో షేక్ గఫూర్, ఎం. సత్యం, సాంబ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.