17 May, 2026 | 3:50 PM

దేశాన్ని ఐక్యం చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్

01-11-2025 12:00 AM

సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్ బాబు

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 31: దేశాన్ని ఐక్యం చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి శేఖర్ బాబు అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నేషనల్ యూనిటీ డేని ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా శేఖర్ బాబు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్  దేశంలో 526 సంస్థానాలను ఏకం చేసి ఒకే భారత దేశంగా ఉండడానికి కృషి చేసి ఉక్కుమనిషిగా పిలవబడ్డారన్నారు. పటేల్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత దేశ ఐక్యమత్యానికి జాతీయ సమైక్యతకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్  కండె శ్రీనివాస్  కీర్తివర్ధన్, రఘు, భరణి సేతుపాండియన్, హెచ్ ఓ డి లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.