ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం
హైదరాబాద్: గాంధీభవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం మంగళవారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అతిథిగా హాజరై, పార్టీ సంస్థాగత బలోపేతం, ఆదివాసీ కాంగ్రెస్ కార్యవర్గ ఎన్నికలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పలువురు ఆదివాసీ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసి, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.






