18 August, 2026 | 4:43 PM

Breaking News

లగ్డారం రైతుల తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు

18-08-2026 04:02 PM

అమీన్ పూర్: లగ్డారం రైతుల సమస్యపై మంగళవారం ఉదయం హైకోర్టు అడ్వకేట్ ఐలాపూర్ మాణిక్ యాదవ్ రైతుల తరఫున లంచ్ మోషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ మరియు పోలీస్ శాఖల అధికారులు నిన్న లగ్డారం ప్రాంతానికి వచ్చి రైతుల పంటలను నాశనం చేసిన ఘటనను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు న్యాయం జరిగేలా, వారి భూముల విషయంలో చట్టపరమైన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా అడ్వకేట్ ఐలాపూర్ మాణిక్ యాదవ్  మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరిగే వరకు, వారి భూముల హక్కుల కోసం చట్టపరంగా చివరి వరకు పోరాడుతానని స్పష్టం చేశారు.రైతులకు న్యాయం జరిగే వరకు, వారి భూముల కోసం చట్టపరమైన పోరాటం కొనసాగిస్తాను. రైతుల హక్కుల పరిరక్షణ కోసం ఎప్పుడూ అండగా ఉంటాను అని ఐలాపూర్ మాణిక్ యాదవ్  పేర్కొన్నారు