7 June, 2026 | 5:30 PM

మంజీరా"లో అర్ధరాత్రి..."మహా" ఇసుక దోపిడీ...

07-06-2026 03:24 PM

నిబంధనలకు విరుద్ధంగా జోరుగా ఇసుక త్రవ్వకాలు...

మహారాష్ట్ర గంజి గావ్ లో ఇసుక అనుమతులు...

తెలంగాణ తగ్గేలి మంజీరా సరిహద్దు ప్రాంతంలో జోరుగా ఇసుక త్రవ్వకాలు...

మహారాష్ట్రలో అనుమతులు... తెలంగాణలో తవ్వకాలు.

అక్రమ ఇసుక దోపిడీని నియంత్రించాలని సరిహద్దు గ్రామాల ప్రజల డిమాండ్...

పట్టించుకొని రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు...

బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాదు జిల్లా బోధన్ నియోజకవర్గంలోని తగ్గేలి మంజీర సరిహద్దు ప్రాంతంలో మహారాష్ట్ర క్వారీ వారు శనివారం అర్ధరాత్రి జోరుగా ఇసుక త్రవ్వకాలు చేస్తున్న దృశ్యాలు ఇలా చిక్కాయి అయితే  ప్రతిరోజు అర్ధరాత్రి, రాత్రి, పగలు అనే  తేడా లేకుండా పెద్ద డోజర్ల ద్వారా జెసిబిల ద్వారా తవ్వకాలు చేస్తూ మహారాష్ట్రకు భారీగా తరలిస్తున్నారు. అయినా ఎవ్వరు పట్టించుకోకపోవడం విడ్డూరమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్ర వారు గంజిగావ్ మంజీరా సరిహద్దు ప్రాంతం అనగా మహారాష్ట్ర మంజీరా సరిహద్దు ప్రాంతంలో క్వారీలు అనగా ఇసుక తరలింపుకు పర్మిషన్ ఉండగా సదురు మంజీరా సరిహద్దు ప్రాంతం అనగా మహారాష్ట్ర మంజీరా సరిహద్దు ప్రాంతంలో ఇసుక లేకపోవడంతో మహారాష్ట్ర క్వారీ వారు చేసేది ఏమీ లేక తెలంగాణ మంజీరా సరిహద్దు ప్రాంతం అనగా తగ్గేలీ గ్రామ మంజీరా సరిహద్దు ప్రాంతంలో ఇసుకను కొంతమందితో కమిట్మెంట్ అనగా కొంతమందికి మామూలు ఇస్తూ కొంతమందికి జీరో వ్యాపారం ద్వారా ఇసుక ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకొని వారి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగించుకుంటున్నారు.

పలువురు పలు విమర్శలు చేస్తుండగా దీనిపై ఎలాంటి చర్యలు అధికారులు కానీ పాలకులు కానీ తీసుకోకపోవడం విడ్డూరం అని ప్రజలు వారి తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక  రోజుల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా మహారాష్ట్ర ఇస్కా క్వారీ పర్మిషన్ పేరుతో భారీగా మహారాష్ట్రకు తెలంగాణ ఇసుక తరలిస్తున్నప్పటికీ ఇక్కడున్న అధికారులు గానీ ఇతరులు గాని పట్టించుకోకపోవడం అదేవిధంగా పాలకులు పట్టించుకోవడం విడ్డూరమని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ మంజీరా సరిహద్దు ప్రాంతం మంజీరా లో ఉన్న ఇసుక తెల్ల బంగారంతో సమానం అలాంటి ఇసుక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం వారు మహారాష్ట్ర వారు జోరుగా తరలిస్తూ అక్కడ భారీ రేట్ల కు విక్రయాలు చేస్తున్నారని వీటిపై నిగా పెట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జోరుగా మహారాష్ట్ర క్వారీ వారు తగ్గేలీ మంజీరా సరిహద్దు ప్రాంతంలో ఇసుక జోరుగా త్రవ్వకాలు చేస్తున్న, ఎవరు పట్టించుకోకపోవడం విడ్డూరమని అర్ధరాత్రి ఇసుక త్రవ్వకాలు ఏమిటని ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు, స్థానికంగా ఉన్నవారు కొంతమంది వారికి సపోర్ట్ చేస్తున్నారని కొంతమంది మామూలు తీసుకోవడం మరి కొంతమంది ఇసుక తరలింపులో ఒప్పందాలు కుదుర్చుకొని ఈ దందా జోరుగా కొనసాగిస్తున్నారని వీటి పై స్పందించకపోవడం చాలా దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ఇక్కడున్న అధికారులు గానీ అదే విధంగా పాలకులు గానీ దీనిపై దృష్టి పెట్టాలని తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మహారాష్ట్ర క్వారీ వారు జోరుగా తరలింపు చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రజలు వస్తున్న వర్షం కురిపిస్తున్నారు. ప్రతిరోజు పగలు రాత్రి అని తేడా లేకుండా మహారాష్ట్ర క్వారీ వారు ఇసుక తరలింపు చేస్తుంటే భూసారం నిస్సారవంతమై, వాల్టా చట్టం తూట్లు పడి భావితరాల వారికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేసి సరిహద్దు గ్రామాల భూగర్భ జలాలు అడుగంటి పోకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.