19 August, 2026 | 4:57 PM

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

19-08-2026 04:10 PM

దళారులను నమ్మవద్దు

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని మారుమూల గ్రామాలైన నాగపూర్, జైనురుపల్లి, దన్నూర్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఎంపీడీవో ఎల్ రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఇందిరమ్మ గృహాలు మంజీర అవుతాయని పేర్కొన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఈ సందర్భంగా జైనురు పల్లెలోని అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది.