calender_icon.png 18 February, 2026 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగాదికి సిద్ధంకానున్న సనత్‌నగర్ టిమ్స్

18-02-2026 12:00:00 AM

సమీక్షలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనరసింహ

సనత్‌నగర్, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్) సనత్నగర్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మంగళవారం సమీక్షించారు. టిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్లో మెడికల్, ఫైర్, పొల్యూషన్ కంట్రోల్, వాట ర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

ఉగాది నాటికి హాస్పిట ల్‌ను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హాస్పిటల్కు 24 గంటల పాటు నిరంతర నీటి మరియు విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. ఫైర్ సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రతి అంతస్తును పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రిసెప్షన్ ఏరియా, హెల్ప్ డెస్క్, ఓపీ కౌంట ర్లు, వెయిటింగ్ హాల్, ఓపీ కన్సల్టేషన్ గదు లు, డయాగ్నస్టిక్స్ విభాగం, ఇన్పేషెంట్ వార్డులు, ఫార్మసీ తదితర ఏర్పాట్లను మం త్రి పరిశీలించారు.

పేషెంట్ల రద్దీకి అనుగుణంగా ఓపీ, ఫార్మసీ కౌంటర్ల సంఖ్య ను పెం చాలని సూచించారు. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ వంటి ఆధునిక వైద్య యంత్రాలను మంత్రి పరిశీలించారు. అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ పరికరాలు పూర్తిస్థాయిలో రోగులకు అందుబాటులో ఉండేలా అవసరమైన వైద్యులు మరియు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఉగాది నాటికి అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్ష లో ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి, వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు జేఎండీ మయాం క్ మిట్టల్, డీఎంఈ నరేంద్ర కుమా ర్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.