calender_icon.png 18 February, 2026 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన నాయకులపై దాడులు చేస్తే ఖబడ్దార్

18-02-2026 12:00:00 AM

మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఘాటు హెచ్చరిక

ఆమనగల్లు, ఫిబ్రవరి 17( విజయక్రాంతి): మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్ పై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం అమనగల్ పట్టణంలో పత్యా నాయక్ ఆయన కలసి ఇల్లు కార్యాలపై జరిగిన దాడి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప, వ్యక్తిగత దాడులకు దిగడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు.

గిరిజనుల ఇళ్లు, ఆసుపత్రులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. RS ప్రవీణ్ కుమార్, ఉప్పల వెంకటేష్లపై నిప్పులు ఆయన నిప్పులు చేరిగి,  బిఆర్‌ఎస్ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత సమాజం కోసం పని చేస్తానని చెప్పిన ఆర్‌ఎస్ ప్రవీణ్, ఇప్పుడు కేసీఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకున్నారని విమర్శించారు.

గిరిజనులపై దాడులను ప్రేరేపించడం ఆయనకు తగదని, మేధావిగా చెప్పుకునే వ్యక్తి ఇలాంటి పనులకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. ఉప్పల వెంకట్పే విమర్శలు: ‘తిక్క వెంకటేష్‘ అంటూ సంబోధిస్తూ, ఆయనపై ఉన్న పాత కేసులను రాములు నాయక్ గుర్తు చేశారు. దొంగ బియ్యం స్మగ్లింగ్, 420 కేసులు, రౌడీషీట్ ఉన్న వ్యక్తి గిరిజన నాయకుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

గిరిజనులు ఒకసారి తిరగబడితే కల్వకుర్తి నియోజకవర్గంలో మీరు అడుగు పెట్టలేరు. తండాల్లోకి వస్తే గిరిజన బిడ్డలు బట్టలు విప్పి తరిమి కొట్టడం ఖాయం అని,నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు,రానున్న రోజుల్లో ఉప్పల వెంకటేష్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్లను అడ్డుకుంటామని గిరిజన నాయకులు హెచ్చరించారు. గిరిజనుల జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

 ఎంపీ మల్లు రవి పరామర్శ.....

 ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ పత్తి నాయకులు ఎంపీ మల్లు రవి, రాష్ట్ర స్పోక్స్ పర్సన్ బాలాజీ సింగ్ లు పరామర్శించారు.  ఇల్లు కార్యాలయం పై బీఆర్‌ఎస్ నాయకులు చేసిన దాడి గురించి సత్య నాయకులు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యం లో దాడులు సరికాదని, ఇలాంటి విషయ సంస్కృతిని ప్రోత్సహించవద్దని వారికి పలికారు.

దాడులకు పాల్పడిన వారి పైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు క్రిష్ణ నాయక్, రాగ్య నాయక్, శ్రీను నాయక్, మల్లేష్ నాయక్, విజయ్ నాయక్ పాల్గొన్నారు.