సరికొత్త జానర్‌లో సమవర్తి
సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రం ‘సమవర్తి’. రుద్ర పిక్చర్స్, పంచ భూత ప్రొడక్షన్స్ బ్యానర్లపై శివచరణ్‌రెడ్డి జక్కిడి, శశిధర్‌రెడ్డి పడమటి నిర్మిస్తున్న ఈ మూవీకి అజయ్ నాగ్ వీ దర్శకుడు. సత్యదేవ్, దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గనవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అనే కొత్త జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
శనివారం హీరో సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సత్యదేవ్ చేతిలో కత్తితో ఇంటెన్స్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఆయన చేతిలోని ఖడ్గంలో చిరుత పులి కనిపించ డమే కాక ‘స్వర్గం కూడా మరణాన్ని కోరుతుంది’ అనే క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది.
సౌతిండియా లోని 7 అరణ్య ప్రాంతాల్లో, ఇప్పటిదాకా ఎవరూ వెళ్లని 42 లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ చేయడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: సింజిత్ యెర్రమిల్లి; ----------------డీవోపీ: హర్ష మల్లికార్జున, దేవ్ దీప్ గండికుండు; ఎడిటర్: ఆదిత్య తివారి; ఆర్ట్: మొండ్రు రవికుమార్.






