3 August, 2026 | 5:05 PM

హైదరాబాద్‌ వాసులారా అప్రమత్తం!

03-08-2026 03:54 PM

భారీ వర్షాల హెచ్చరిక.. ప్రజలకు సజ్జనార్ సూచన

హైదరాబాద్: నగరంలో ఈ రాత్రి వరకు భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్(Hyderabad Police Commissioner V.C. Sajjanar) కోరారు. ''అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దు. ఇళ్ల నుంచి బయటకు రావద్దు.  బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగే లోపే పనులను త్వరగా ముగించుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలి. ముఖ్యంగా నీరు నిలిచిన రహదారులు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణాలు చేయడం అస్సలు సురక్షితం కాదు.  వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలి.'' అని సజ్జనార్ సూచించారు.