14 May, 2026 | 1:24 AM

అమెరికన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌కు సదానందం గౌడ్ ఎంపిక

14-05-2026 12:30 AM

తలకొండపల్లి, మే 13: (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన సదానందం గౌడ్ ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ అమెరికా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పురస్కారానికి ఎంపికయ్యారు. విద్య మరియు సామాజిక రంగాల్లో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.

గత 26 ఏళ్లుగా లెక్చరర్గా విద్యా వ్యవస్థకు విశిష్ట సేవలు అందించడమే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో కల్వకుర్తి నియోజకవర్గ జేఏసీ కన్వీనర్గా అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేస్తూ కీలక పాత్ర పోషించారు.పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న నిరంతర కృషిని నిర్వాహకులు ప్రత్యేకంగా గుర్తించారు.ఈ నెల 17వ తేదీన చెన్నైలోని భారతీయ విద్యా భవన్లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయనకు ఈ డాక్టరేట్ను అధికారికంగా అందజేయనున్నారు.