8 August, 2026 | 2:43 AM

బ్రాండ్ వాల్యూలో తగ్గే దే లే

08-08-2026 12:00 AM

రిటైరయినా క్రేజ్ తగ్గని సచిన్

కోహ్లీ, ధోనీ కంటే ఎక్కువ క్రేజ్

టాప్ 5 సెలబ్రిటీ బ్రాండ్లలో చోటు

ముంబై, ఆగస్టు 7: మన దేశంలో క్రికెటర్లకు ఉండే క్రేజే వేరు. ఐపీఎల్ వచ్చిన తర్వాత స్టార్ ప్లేయర్స్‌గా మారిన ఎంతోమంది యువ ఆటగాళ్లతో ఒప్పందాల కోసం కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. అయితే రిటైరయిన ఆటగాళ్లపై కంపెనీలు ఆసక్తి చూ పవన్న అభిప్రాయం ఉంది. కానీ ఇది తప్పని మరోసారి రుజువైంది.

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రిటైరయిన తర్వాత కూ డా బ్రాండ్ వాల్యూలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన భారత రిటైర్డ్ ఆటగాడిగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు నమోదు చేసిన సచిన్ టెండూల్కర్. రిటైర్మెంట్ ప్రకటించి 13 ఏళ్ల అవుతు న్నా అతని క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు.

రోజూ ఏదో ఒక వాణిజ్య ప్రకటనలో  కనిపిస్తూనే ఉన్నాడు. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడాకారుల్లో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన ప్లేయర్‌గా సచిన్ రికార్డులకెక్కాడు.క్రోల్ ఇండియా సెలెబ్రిటీ బ్రాండ్ వాల్యూయేష్ 2025 రిపోర్ట్ ప్రకారం సచిన్ విలువ 125.9 మిలియన్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో రూ.1189 కోట్ల రూపాయ లు. భారత్‌లో టాప్- సెలబ్రిటీల్లో ఎక్కు వ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా సచిన్ ఉన్నాడని క్రోల్ ఇండియా తమ నివేదికలో పేర్కొంది.

ప్రతీ సంవత్సరం అతని విలువ పెరుగుతోందనీ, అన్ని వయసుల వారికి అతను తెలియడంతో కంపెనీలు సచిన్‌తో ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపింది. ఇదిలా ఉంటే ధోనీ, విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ బ్రాండ్స్‌కు సచి న్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 24 ఏళ్ల పాటు కొనసాగిన సచిన్ 2013లో వీడ్కోలు పలికాడు. ఆటకు దూరమైనా.. ప్రకటనల్లో నటిస్తూ భారీగానే ఆర్జిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు, 34 వేలకు పైగా రన్స్‌తో రికార్డు సృష్టించిన సచిన్ ఆదాయంలోనూ తనకు తి రుగేలేదని నిరూపిస్తున్నాడు.