20 May, 2026 | 5:01 PM

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

20-05-2026 03:58 PM

అన్నదాతల అవగాహన

చందుర్తి,(విజయక్రాంతి): మండలంలోని మూడపల్లి గ్రామ రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ,అన్నదాతల అవగాహన  కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతు సోదరులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తక్కువ యూరియా వాడకం, సాగు ఖర్చులు తగ్గించడం, నేల ఆరోగ్యాన్ని కాపాడడం. పంట మార్పిడి పాటించడం. సుస్థిర ఆదాయాన్ని పొందడం. సాగు నీటి ఆదా,సేంద్రియ పద్ధతులు,ఆరోగ్యకరమైన ఆహారం.

అవసరం మేరకు మాత్రమే రసాయనాల వినియోగం, ప్రకృతి రక్షణ. అదే విధంగా రాబోయే వానకాలం సీజన్ లొ వరి సాగు చేసే రైతులు తప్పనిసరిగా సన్న రకాలు సాగు చేయాలని తద్వారా ప్రభుత్వం అందించే బోనస్ లబ్ది పొందాలని, ఆయిల్ పామ్ సాగు వైపు మల్లాలని సూచించారు. రైతులు తమ అభిప్రాయాలు, ఆశలు తెలియజేసి, మరింత అభివృద్ధి కోసం సూచనలు కూడా చేశారు. కార్యక్రమం రైతులలో చైతన్యం పెంచడంలో ముఖ్య పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు.