రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్
ఖమ్మం, జూలై 11(విజయక్రాంతి): చింతకాని మండలం జగన్నాధపురం – మత్కేపల్లి క్రాస్ రోడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న రైతు ఆశీర్వాద సభను ఘనవిజయం చేసిన జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, జిల్లా అధికార యంత్రాంగం, ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగ సోదర సోదరీమణులకు, జిల్లాకాంగ్రెస్ నాయకులకు, బ్లాక్, మండల, పట్టణ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, సభ విజయవంతానికి సహకరించిన ప్రజలందరికీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రైతు ఆశీర్వాద సభకు రైతులు, ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు విశేషంగా తరలివచ్చి విజయవంతం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సభ నిర్వహణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని కొనియాడారు.
అలాగే సభకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్ నాయక్, మట్టా రాగమయి దయానంద్, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ నూతి సత్యనారాయణ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.






