ఆస్తిపన్ను చెల్లింపులపై 5 శాతం రాయితీ: డిప్యూటీ కమిషనర్ వాణి
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఆస్తిపన్ను చెల్లింపులపై ప్రభుత్వం అందిస్తున్న 5 శాతం రాయితీని ప్రజలు వినియోగించుకోవాలని ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్ కార్యాలయంలో శనివారం ప్రభుత్వం అందిస్తున్న ఆస్తి పన్నుపై 5 శాతం ఎర్లీ బర్డ్ రాయితీపై అవగాహన సమావేశము నిర్వహించబడింది. ఘట్‌కేసర్, ఎదులాబాద్ డివిజన్లలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులపై ఈ సమావేశంలో ముందస్తుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే పౌరులకు ప్రభుత్వం అందిస్తున్న 5% ఎర్లీ బర్డ్ రాయితీ గురించి వివరంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమీషనర్ వాణి మాట్లాడుతూ... నిర్ణీత గడువు 01/ ఏప్రిల్/2026 నుండి 30/ ఏప్రిల్/2026 లోపు ట్యాక్స్ చెల్లించడం ద్వారా ప్రజలు ఈ 5 శాతం రాయితీ ప్రయోజనాన్ని పొందవచ్చని సూచించారు. సమయానికి పన్నులు చెల్లించడం ద్వారా పట్టణ అభివృద్ధికి తోడ్పడవచ్చని తెలిపారు. కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పౌరులు తమ ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడాలని, అలాగే వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, తమ కాలనీల్లోని వారికీ ఈ సమాచారం చేరవేసి, అందరూ రాయితీ ప్రయోజనాన్ని పొందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అసోసియేషన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




