5 April, 2026 | 12:29 AM

హిమాయత్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

04-04-2026 09:42 PM

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య సేవలు

మొయినాబాద్,(విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ వార్డు కార్యాలయంలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మున్సిపల్ కౌన్సిలర్లు బేగంబీ, బిల్లపాటి కవిత ఎల్లేష్, షాబాద్ కిషన్, పలగోల్ల విజయలక్ష్మీ, అశోక్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం శిబిరాన్ని సందర్శించిన వారు వైద్యులు అందిస్తున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. శిబిరంలో స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.