24 April, 2026 | 2:32 PM

Breaking News

ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం   •   మండేపల్లిలో చలివేంద్రం ప్రారంభం – ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన   •   డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   శంకర్‌ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం.. ఆర్టీసీలో ఉద్యోగం: నర్సంపేట ఆర్‌డీఓ   •   సచివాలయంలో ఆర్టీసీ సమ్మెపై కీలక చర్చలు.. RTC కార్మికుల 3 ప్రధాన డిమాండ్లు ఇవే   •   తిరుమల శ్రీవారికి భారీగా బంగారం విరాళం   •   కారు అదుపుతప్పి బోల్తా.. మహిళ మృతి   •   ఖమ్మంలో రైతుల కోసం మహాధర్నా   •   బండి సంజయ్‎ను అడ్డుకున్న పోలీసులు.. నర్సంపేటలో హైటెన్షన్   •   ఖమ్మం వైరా రోడ్డులో దారుణం.. కత్తులతో పరస్పర దాడి   •  

ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

24-04-2026 12:54 PM

ముకరంపుర,(విజయక్రాంతి): సమస్యల పరిష్కారానికై ఆత్మహత్యకు పాల్పడిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్(RTC Driver Shankar Goud) అర్ధరాత్రి మృతిచెందడం బాధాకరమని ఆర్టీసీ జేఏసీ కరీంనగర్ జిల్లా నాయకుడు జున్నూరి శ్రీనివాస్ అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా శుక్రవారం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చాలాకాలంగా విన్నవించుకుంటున్నామని తెలిపారు.

అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తప్పనిసరిగా సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ  సందర్బంగా ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.