24 April, 2026 | 2:29 PM

Breaking News

ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం   •   మండేపల్లిలో చలివేంద్రం ప్రారంభం – ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన   •   డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   శంకర్‌ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం.. ఆర్టీసీలో ఉద్యోగం: నర్సంపేట ఆర్‌డీఓ   •   సచివాలయంలో ఆర్టీసీ సమ్మెపై కీలక చర్చలు.. RTC కార్మికుల 3 ప్రధాన డిమాండ్లు ఇవే   •   తిరుమల శ్రీవారికి భారీగా బంగారం విరాళం   •   కారు అదుపుతప్పి బోల్తా.. మహిళ మృతి   •   ఖమ్మంలో రైతుల కోసం మహాధర్నా   •   బండి సంజయ్‎ను అడ్డుకున్న పోలీసులు.. నర్సంపేటలో హైటెన్షన్   •   ఖమ్మం వైరా రోడ్డులో దారుణం.. కత్తులతో పరస్పర దాడి   •  

ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

24-04-2026 12:50 PM

కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్, ఏప్రిల్24(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) విమర్శలు గుప్పించారు. గత బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన తప్పే.. కాంగ్రెస్ చేస్తోందని అన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కార్మికుడి ఆత్మహత్య.. ఇది ప్రభుత్వ హత్య’ అంటూ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు. ఇంత పెద్ద సమ్మె జరిగితే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు

బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన తప్పే.. కాంగ్రెస్(Congress Government) చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 28వ పేజీలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. రెండు పీఆర్‌సీలు చెల్లిస్తామని హామీ ఇచ్చారంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోను కేంద్ర మంత్రి చదివి వినిపించారు. ఆర్టీసీ సమస్యలపై బీజేపీ పోరాడితే.. ఓటు కాంగ్రెస్‌కు వేశారని అన్నారు.