13 April, 2026 | 1:39 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

బాత్రూంలో జారిపడి ఆర్టీసీ మహిళా కండక్టర్ మృతి..

04-10-2025 07:51 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాత్రూంలో జారీపడి ఆర్టీసీ మహిళా కండక్టర్ మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలో చోటుచేసుకుంది. సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి బేగరీ సాయవ్వ(49) అనే మహిళా కండక్టర్ పిట్లం గ్రామానికి చెందిన ఆమె ప్రస్తుతం ఆమె భర్త శంకర్ తో కలిసి బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలోని తన అద్దె ఇంట్లో బాత్రూంకు వెళ్లి ప్రమాదవశాత్తు బాత్రూంలో పడిపోగా ఎడమ కంటికి, తల వెనుక భాగంలో దెబ్బలు తగలగా అది గమనించిన కుటుంబ సభ్యులు ప్రైవేట్ అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినదని నిర్ధారించారు. కుమారుడు సాయి చరణ్ భర్త శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.