మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి
బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి
కూసుమంచి, (విజయ క్రాంతి): మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి తహసీల్దార్ ను కోరారు. సోమవారం కూసుమంచి మండల ఎమ్మార్వో గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తహసీల్దార్ డి సైదులు ని మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన్ని సన్మానించారు.
ఈ సందర్భంగా కూసుమంచి మండల ప్రజలు, ముఖ్యంగా రైతులు వివిధ పనులు నిమిత్తం కార్యాలయము వద్దకు వచ్చినప్పుడు హెల్ప్ డెస్క్ ద్వారా వారి సమస్యలు కనుగొని సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరించే విధంగా చొరవ చూపాలని కోరారు. అలాగే మండల కేంద్రంలో ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కావున సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తక్షణం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, బోనస్ చెల్లించాలి అని విజ్ఞప్తి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పిట్టల వేణు గుండా విజయ్ పాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు




