పెద్దమల్లరెడ్డిలో వర్షానికి కూలిన ఇల్లు
29-07-2026 10:23 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన బైండ్ల పరశురాములు నివసిస్తున్న ఇల్లు నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు కూలిపోయింది. సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ కోడూరి సాయిగౌడ్, ఉపసర్పంచ్ చైతన్య కొండల్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని వారు కోరారు.






