ఆటిజంపై రౌండ్‌టేబుల్ సమావేశం
- సుచిరిండియా ఆధ్వర్యంలో నిర్వహణ
- త్వరిత గుర్తింపు, సమగ్రత, కుటుంబ మద్దతుపై నిపుణుల పిలుపు
- ఆటిజం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో..
- సమిష్టి చర్య అవసరమని లయన్ డాక్టర్ కిరణ్ సూచన
హైదరాబాద్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): లయన్ డాక్టర్ కిరణ్, బల్గేరియా రిపబ్లిక్ గౌరవ కాన్సుల్, సుచిరిండియా గ్రూప్ సీఈ ఓ నాయకత్వంలో సుచిరిండియా ఫౌం డేషన్, అండర్‌స్టాండిగ్ మైండ్స్, ఎమ్‌పవరింగ్ లైవ్స్ అనే థీమ్‌తో ఆటిజం ఇంటర్వెన్షన్, ఇన్‌క్లూజన్‌పై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని రవీంద్రభారతి మినీకాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వ హించింది. ఈ కార్యక్రమానికి 100కి పైగా సంస్థలు, వైద్య నిపుణులు, థెరపిస్ట్లు, విద్యావేత్తలు,తల్లిదండ్రులు హాజరై ఆటిజం అవగా హన, త్వరిత నిర్ధారణ, చికిత్స, సమగ్ర విద్య, బలమైన కమ్యూనిటీ మద్దతుపై చర్చించారు.
ఈ సమావేశంలో మాజీ ఆర్‌సీ ఎన్‌ఐ ఎంహెర్ ఇన్చార్జ్, డిసెబిలిటీ రిహాబిలిటేషన్ ప్రొఫెసర్ పోరిక సమ్మయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలాగే ఎన్‌ఐఈపీఐడీలో పీడియాట్రిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జీ మేరిఅనురూప, సీనియర్‌లెక్చరర్ ఇన్ ఆక్వుపేషనల్ థెరపీ డాక్టర్ టీ ముగేశ్ (ఎన్‌ఐఈపీ ఐడీ, సికింద్రాబాద్) పాల్గొని ఆటిజం లక్షణాలు, ప్రారంభ సంకేతాలు, చికిత్సా విధా నాలు, కుటుంబ సాధికారత, ఆటిజం ఉన్న పిల్లల కోసం సమగ్ర వాతావరణం అవసరంపై మాట్లాడారు.
లయన్ డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ, ఆటిజం ఉన్న పిల్లలు, వారి కుటుంబాల కోసం మరింత అవగాహన, బలమైన మద్దతు వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. మూడు దశాబ్దాల క్రితం 1,000 మందిలో ఒకరికి కనిపించిన ఆటిజం, ఇప్పు డు 89 మందిలో ఒకరికి పెరిగిందన్నారు. ‘ఇది కేవలం గణాంకం కాదు; తక్షణం, సమష్టిగా స్పందించాల్సిన స్పష్టమైన సంకేతం’, అని ఆయన అన్నారు.
అవగాహన లోపం, ఆలస్యమైన గుర్తింపు, శిక్షణ పొందిన నిపుణుల కొరత, సమగ్ర మద్దతు వ్యవస్థలు బలహీనంగా ఉండటం వల్ల చాలా మంది పిల్లలు నిర్ధారణకు గురికావడం లేదని అన్నారు. ఆటిజం సంభాషణ, సామాజిక పరస్పర చ ర్య, భావ వ్యక్తీకరణ, ప్రవర్తనా స్పందనలపై ప్రభావం చూపుతుందని, ఇది పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబాలు, సమా జం మొ త్తానికి పెద్ద సవాలుగా మారుతోందని ఆయన వివరించారు.
డాక్టర్ కిరణ్ ఆటిజం మిష న్ ద్వారా ఎన్జీఓలు, వైద్యులు, థెరపిస్ట్లు, విద్యావేత్తలు, తల్లిదండ్రులతో కలిసి ఆటిజం సమస్యలు, చికిత్సా లోపాలు, విధాన సూచనలపై సమగ్రనివేదిక రూపొందించ నున్నట్లు తెలిపారు. ఆ నివేదికను ప్రభుత్వ అధికారులకు, సంబంధిత భాగస్వాములకు సమర్పించి మెరుగైన విధాన చర్య లు, మెరుగైన సంరక్షణ వ్యవస్థలకు దారితీయనున్నట్లు చెప్పారు. పోరిక సమ్మయ్య మాట్లాడుతూ, ఆటిజంపై అవగాహన మాత్ర మే కాకుండా, కుటుంబాలకు నిర్ధారణ నుం చి థెరపీ, విద్య వరకు దారిచూపే వ్యవస్థ అవసరమని అన్నారు.
డాక్టర్ జీ మేరీ అనురూప మాట్లాడుతూ, ఆటిజం పారంభ సంకే తాలను గుర్తించడం అత్యంత కీలకమని, స మయానికి స్క్రీనింగ్, రిఫెరల్ జరిగితే పిల్లల ఫలితాలు చాలా మెరుగవుతాయని చెప్పా రు. డా.ముగేశ్ మాట్లాడుతూ, ఈ సమావేశం ఆటి జం ఉన్నపిల్లల ప్రత్యేక అవసరా లు, ము ఖ్యంగా ఇంద్రియ సంబంధిత సవాళ్లుపై దృష్టి పెట్టిందని తెలిపారు.
కార్యక్ర మంలో బాలవికాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీ విద్యా స్ సెంటర్ ఫర్ ది స్పెషల్ చిల్డ్రన్, ప్రేరణ సంక్షేమ సంఘం, లక్ష్యసాధన, సాధ న సొసై టీ ఫర్ ది మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, నిర్మాణ్ అసోసియేషన్ ఫర్ ది ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్, ఆత్మీయ మానసిక వికాస కేంద్రం, లైట్ (డిఫరెంట్లీ ఏబుల్డ్), పీహెచ్‌ఐఎన్ (పీపుల్ విత్ హియరింగ్ ఇంపెయిర్డ్ నెట్వర్క్), రాధా ఇనిస్టిట్యూట్ ఫర్ మెంటల్లీ రిటార్డెడ్ పాల్గొన్నారు.సుచిరిండియా ఫౌండేషన్, ఆ రోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఉపాధికల్పన, వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా సామాజిక మార్పు పునరుద్ఘాటించింది.






