26 April, 2026 | 2:50 AM

ఫిట్‌నెస్ సాధించే పనిలో రోహిత్

26-04-2026 01:16 AM

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఆడే ఛాన్స్

ముంబై, ఏప్రిల్ 25: ముంబై ఇండియన్స్ అభిమానులకు జోష్ పెంచే చార్త. ఇటీవల ఆర్సీతో మ్యాచ్‌లో గాయపడి ఆటకు దూరమైన రోహిత్ శర్మ మెల్లిగా కోలుకుంటున్నాడు. అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఏప్రిల్ 29న సన్‌రైజర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఇప్పటికే కోలుకున్న రోహిత్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే పూర్తి ఫిట్‌నెస్ సాధించేవ రకు రిస్క్ తీసుకోవద్దన్న ఉద్దేశంతో గత మూడు మ్యాచ్‌ల్లో రోహిత్‌ను ఆడించలేదు. ఇప్పుడు సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ౪రోజుల టైమ్ ఉండడంతో హిట్‌మ్యాన్‌కు కలిసొస్తుంది. ఫిట్‌నెస్ సాధించడంపై ఫోకస్ పెట్టిన హిట్‌మ్యాన్ రీఎంట్రీ ఇస్తే ముంబై మళ్లీ గెలుపు బాట పడుతుందేమో చూడాలి.