25 June, 2026 | 2:07 PM

Breaking News

రహదారి భద్రతా నిబంధనలు పాటించాలి

16-04-2026 01:27 AM

మంచిర్యాల, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. అరైవ్ అలైవ్ లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని కలెక్టరేట్ ఆవరణలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, గుడిపేట పోలీస్ బెటాలియన్ అడ్మిన్ వెంకటరాములు, జిల్లా రవాణా అధికారి గోపికృష్ణలతో కలిసి జెండా ఊపి ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు.

పోలీస్, రవాణా శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యలై వాహనాలను నిబంధనలకు లోబడి జాగ్రత్తగా నడపాలని కోరారు. వాహనం నడిపే సమయంలో మనం పాటించే చిన్న చిన్న విషయాలే మన ప్రాణాలను కాపాడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో, బెటాలియన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.