రోడ్డు భద్రతే లక్ష్యం..సేవా దృక్పథంతో పనిచేయాలి
నూతన ఆర్టీఓలకు టీఎస్‌పీఏ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ పిలుపు
రాజేంద్ర నగర్, జూలై 17 (విజయక్రాంతి): రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయాలంటే టెక్నాలజీ ఆధారిత ఎన్ఫోర్స్మెంట్ శాఖలు మరింత సమర్థవంతగా పనిచేయాలని టి ఎస్ పి ఎ డైరెక్టర్ అభిలాష బిస్ట్ తెలిపారు రోడ్డు భద్రత పై ప్రజల్లో అవగాహన తోనే అది సాధ్యం అవుతుందని నూతన అర్ టి ఓ లు ఈ అంశం పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె కోరారు . అర్ బి వి అర్ లో తెలంగాణ రవాణా శాఖకు చెందిన ముగ్గురు రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ల కోసం అకాడమీలో రెండు నెలల ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పై శిక్షణ పొందారు శుక్ర వారం ముగింపు కార్యక్రమానికి రవాణా శాఖ కమిషనర్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా టి ఎస్ పి ఎ డైరెక్టర్ అభిలాష బిస్ట్ మాట్లాడుతూ యూనిఫాం సర్వీస్లో ప్రతి నిర్ణయం ప్రజల ప్రాణాలకు, భద్రతకు సంబంధించినదని అన్నారు. అందుకే లా, ప్రొసీజర్, మోటార్ వెహికల్స్ యాక్ట్, రూల్స్పై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు డా. చేతన, కవిత, వెంకటేశ్వర్లు, శ్రీరామమూర్తి, కె.ఆర్.కె. ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్లు వేమా శ్రీనివాసరెడ్డి, యార్లగడ్డ రాంబాబు, వేముల శ్రీనివాసరావు, ఆర్టీఓ రఘునాథ్ గౌడ్ ఎం వి ఐ శీతల , డీఎస్పీ రామారావు,బి కృష్ణ ఆర్ ఐ రామకృష్ణ, అకాడమీ, ట్రాన్స్పోర్ట్ శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.






