21 August, 2026 | 4:34 PM

Breaking News

తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •   ఏఐవైఎఫ్ తాండూర్ మహాసభలను జయప్రదం చేయండి   •  

రోడ్డుకు మరమ్మత్తు పనులు పూర్తి చేయాలి

21-08-2026 01:13 PM

గడ్డపోతారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్ 

జిన్నారం, ఆగస్టు 21: ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా మాదారంలో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని గడ్డపోతారం మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్ రోడ్లు  ఆర్ అండ్ బి అధికారులను కోరారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. గుంతలు పడిన రహదారుల తో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అసంపూర్తిగా ఉన్న మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని కోరారు. వర్షాకాలం, రద్దీ సమయంలో ప్రమాదాలు జరగకుండా నాణ్యతా ప్రమాణాలతో పనులు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్లేష్ ముదిరాజ్, స్వాతి గణేష్, నవీన్, ఆర్ అండ్ బి అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.