2 June, 2026 | 4:38 AM

బీజేపీతోనే రహదారుల అభివృద్ధి

02-06-2026 12:05 AM

మెదక్ ఎంపి రఘునందన్ రావు

రామచంద్రపురం, జూన్ 1 : రామచంద్రపురం మండలం బి.హెచ్.ఈ.ఎల్ లింగంపల్లి ఎక్స్ రోడ్డు నుండి అమీన్పూర్ వరకు స్టేట్ రోడ్డు వాగుపై నిర్మాణంలో ఉన్న బాక్స్ క ల్వర్టు రోడ్డును మెదక్ ఎం.పి రఘునందన్ రావు స్వయంగా సందర్శించారు. క్షేత్రస్థాయి లో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడు తూ ఎన్నికల సమయంలో అమీన్పూర్ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. స్థానికులు ఎదుర్కొంటున్న ప్రధాన రవాణా సమస్యను ప రిష్కరిస్తూ ఈ రోడ్డు పనులను వేగవంతం చేశామని చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ సజావుగా సాగడానికి, రోడ్డు నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరించిన ప్రభుత్వ అధికారులకు, ఇంజనీరింగ్ సిబ్బందికి ఆయన ప్రత్యేకం గా ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమములో నియోజకవర్గం బిజెపి నాయకులు జిల్లా అధ్య క్షులు గోదావరి అంజి రెడ్డి, ఆర్.సి.పురం డి విజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్, మాజీ ము న్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఎడ్ల రమేష్, శంషాబాద్ రాజు, రాంబాబు గౌడ్, రవీందర్ రెడ్డి తధితరులు పాల్గొన్నారు.