4 April, 2026 | 11:18 PM

పోమాల్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆర్జేడీ సోమిరెడ్డి

04-04-2026 08:52 PM

నవాబ్ పేట్: మండల పరిధిలోని పోమాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శ్రీ సోమిరెడ్డి సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న వినూత్న విద్యా కార్యక్రమాలను పరిశీలించిన ఆయన, ఉపాధ్యాయుల కృషిని అభినందిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పోమాల పాఠశాల పేరును రాష్ట్రస్థాయిలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు.

అనంతరం 'యూత్ ఫర్ సేవ' సంస్థ సౌజన్యంతో 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు సుమారు రూ. 1,000 విలువైన స్టడీ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లలో ఇంగ్లీష్ డిక్షనరీ, జామెట్రీ బాక్స్, 5 నోట్‌బుక్కులు మరియు ఇతర విద్యా సామాగ్రి ఉన్నాయి. వేసవి సెలవుల్లో వీటిని సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కవితా నరేష్, ఏఏపిసి చైర్మన్ సుజాత శ్రీశైలం, ప్రధానోపాధ్యాయులు వెంకటరాములు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.