4 April, 2026 | 11:22 PM

అద్దంకి దయాకర్ జన్మదిన వేడుకలు

04-04-2026 08:49 PM

- తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అద్దంకి పాత్ర మరువరానిది

- జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు... తోటమల్ల రమణ మూర్తి

చర్ల,(విజయక్రాంతి): అద్దంకి దయాకర్ జన్మదిన వేడుకలను స్థానిక మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, జాతీయ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి దయాకర్ పాత్ర మరువలేనిదని జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడెల్లి గణపతి, రాష్ట్ర నాయకులు తడికల లాలయ్య, కొంగూరు రమణారావు కొనియాడారు. శనివారం ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మాల మహానాడు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

మాల మహానాడు మండల గౌరవాధ్యక్షులు మోతుకూరి ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు ముందుగా కేక్ కట్ చేసుకుని ఒకరినొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అనేక సామాజిక ఉద్యమాలలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ క్రియాశీలకంగా పనిచేశారని,

ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో అనేకమంది మేధావులతో కలిసి ఉద్యమాలు చేసిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమంలో అద్దంకి దయాకర్ పాత్ర మరువలేనిదని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులు కారంపూడి సాల్మన్ రాజ్, మండల ప్రచార కార్యదర్శి కొంగూరు సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు తోటమల్ల కృష్ణారావు, మండల కమిటీ సభ్యులు ఇప్పా ప్రభుదాస్, మేడబత్తిని గోవర్ధన్, పరవా బాలరాజు తదితరులు పాల్గొన్నారు.