3 July, 2026 | 5:15 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

28-04-2026 12:54 AM

సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ

వెంకటాపూర్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ సూచించారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ధాన్యంలో 17 శాతం లోపు తేమ ఉండేలా చూసుకోవాలని, తాలు, మట్టి లేకుండా బాగా ఆరబెట్టి తీసుకురావాలని సూచించారు.

అలా చేస్తే రైతులకు మద్దతు ధర సులభంగా లభిస్తుందని తెలిపారు. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ జిరాక్స్, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పిస్తే 48 నుంచి 72 గంటల్లోనే డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. దళారులను నమ్మి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర చల్ల రాజు, సీఈవో శంకరయ్య, ఏఈఓ నవీన్, జంగిలి రవి, సాంబయ్య, పీఏసీఎస్ సిబ్బంది శ్రీకాంత్, రమేష్, లింగయ్య, కోటయ్య, హమాలీలు, రైతులు పాల్గొన్నారు.