పాక్ హైకమిషన్‌కు బుల్డోజర్
బారికేడ్లు, కంచెలు, క్యూలైన్ల తొలగింపు
ఇస్లామాబాద్‌లో భారత్ హైకమిషన్‌పై చర్యలకు ప్రతీచర్య
న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఢిల్లీలోని చాణక్యపురి శాంతిపథ్‌లో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం బయట అక్రమంగా ఏర్పాటు చేసి బారికేడ్లు, కంచెలను బుధవారం అర్ధరాత్రి బుల్డోజర్లతో తొలగించారు. ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్ వెలుపల చర్యలకు ప్రతీచర్యగా దీన్ని భావిస్తున్నారు.
హైకమిషన్ కార్యాలయం నిర్మాణాలు నిర్దేశిత సరిహద్దులను దాటినందుకు ఈ చర్య తీసుకున్నామని గురువారం అధికారులు వివరించారు. వీసా విభాగం సమీపంలోని బారికేడ్లు, కంచెలు, క్యూ లైన్ల కోసం చేసిన నిర్మాణాలను కూడా తొలగించామన్నారు. ఆ ప్రాంతంలో రెయిలింగ్‌లు, గేట్లు, ఇటుకలు చెల్లాచెదురుగా దర్శనమిస్తున్నాయి. హై కమిషన్ గేటు బయట ఉన్న లోహపు కంచెను కూడా తొలగించారు. ప్రధాన ద్వా రం (మెయిన్‌గేటు)కు మాత్రం ఎలాంటి న ష్టం వాటిల్లలేదు. కాగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా భారత్‌లో అంతర్భాగమని వ్యాఖ్యానించడంపై పాక్ తీవ్రంగా వ్యతిరేకించింది.






