దేశ ప్రగతికి రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు
ఏఎంసీ వైస్ చైర్మన్ సాధుల పవన్
నంగునూరు, ఆగస్టు 20 (విజయక్రాంతి): కేవలం 40 ఏళ్ల వయసులోనే ప్రధాని బాధ్యతలు చేపట్టి, యువతకు ప్రాధాన్యతనిస్తూ దేశ ప్రగతికి రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు అందించరని నంగునూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాధుల పవన్ కుమార్ అన్నారు. రాజీవ్ గాంధీ 82వ జయంతిని పురస్కరించుకుని గురువారం నంగునూరు మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
భారతదేశంలో ఆధునిక సాంకేతిక తకు, కంప్యూటర్,టెలికమ్యూనికేషన్ రంగాల విప్లవానికి రాజీవ్ గాంధీ బలమైన పునాది వేశారని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎండీ ఇమ్రాన్, గుట్టం రంగారెడ్డి,ప్యాక్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు రవీంద్ర చారి,శివరాత్రి మైసయ్య, బీసీ సెల్ జిల్లా కోఆర్డినేటర్ బొల్లు సంజీవ్, సదానందం, బోజు రాములు, రాజు, మహేష్, భాను, సందీప్ తదితరులు పాల్గొన్నారు.






