21 August, 2026 | 3:30 AM

వాల్యూ జోన్‌లో సినీనటి హెబ్బా సందడి

21-08-2026 01:39 AM

బంజారాహిల్స్, ఆగస్టు 20 (విజయక్రాంతి):నగరంలోని సత్యా ఏజెన్సీస్ వాల్యూజోన్ లో సినీనటి హెబ్బా పటేల్ సందడి చేశారు. రెడ్ మీ నోట్ 17 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టగా ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాల్యూజోన్ స్టోరులో గురువారం నిర్వహించారు. ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన హెబ్బా పటేల్ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించి మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నటి మాట్లాడుతూ నాణ్యత, మన్నిక విషయంలో షావోమి బ్రాండ్ కు చెందిన రెడ్ మీ ఫోన్లు బాగుంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. నూతన మోడల్ వినియోగదారుల ఆదరణ చూరగొంటుందని ఆశించారు.

అనంతరం షావోమీ ప్రతినిధులు సుదీప్ నల్లచెరువు, శ్రీనివాస్ నల్లచెరువు మాట్లాడుతూ ఈ సిరీస్ లో దేశీయ మార్కెట్లోకి వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 17 5జీ అని పేర్కొన్నారు. దీని ప్రారంభ ధర రూ.27,999 అన్నారు. 6 జీబీ, 8 జీబీ ర్యామ్ వేరియంట్లలో మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రారంభ ఆఫర్ కింద ఎస్బీఐ, యాక్సిస్, కొటక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.3,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుందని ప్రకటించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3 పై పనిచేస్తుందన్నారు. వినియోగదారుల కోసం కంపెనీ తరపున నాలుగేళ్ల ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్లు, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్టోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.