21 August, 2026 | 2:40 AM

బెల్టుషాప్‌లు ఉంటే నోటీసులు ఇవ్వండి

21-08-2026 01:41 AM

విజయక్రాంతి కథనానికి సమావేశంలో ప్రత్యేక చర్చ 

ఎంఈఓ శంకర్ నాయక్ పై ప్రజాప్రతినిధుల గరం గరం 

ప్రజా సమస్యలపై అధికారులను నిలదీసిన సర్పంచ్‌లు

బాలానగర్, ఆగస్టు 20: గ్రామ గ్రామాన ఫీవర్ వస్తే మందు గోలి దొరుకుతుందో దొరకదు తెలియదు కానీ ఖచ్చితంగా మద్యం బాటిల్ మాత్రం అందరికీ అందుబాటులో ఉంటుందంటూ ఆయా గ్రామాల సర్పంచులు ఎక్సైజ్ శాఖ అధికారులను నిలదీశారు. గురువారం మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం ఎంపీడీవో  అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో ప్రశ్నల వర్షం రసబసగా సాగింది.

ఈ సమావేశంలో బాలానగర్ సర్పంచ్ గుమ్మల వెంకటేశ్వర్ రెడ్డి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, విజయక్రాంతి దినపత్రిక మండల పరిధిలో ప్రైవేట్ పాఠశాలల తీరు సరిగా లేదంటూ కథనాన్ని ప్రచురించడం జరిగిందని ఈ విషయంపై ఎంఈఓ తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నందవరం గ్రామ సర్పంచ్ సభవత్ హర్షింగ్ నాయక్ పలు గ్రామాలలో తాగునీరు అందడం లేదని పలుమార్లు అధికారులకు చెప్పినప్పటికీ స్పందించడం లేదని విమర్శించారు.

ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వని అధికారులు మరి ఎందుకు ఉన్నట్టు అంటూ ప్రశ్నించారు. ప్రజలకు జవాబుదారీగా అధికారులు ఉండవలసిందిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరింత ముందుకు వెళ్లి ఫిర్యాదు చేయడం జరుగుతుందని చెప్పారు. సమస్యలు లేని మండలంగా ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అధికారుల దృష్టికి పలువురు సర్పంచులు పలు సమస్యలను తీసుకువచ్చారు.

ఎన్ని మాటలు సమస్యలను అధికారుల ముందు ఉంచిన అస్సలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. అనం తరంఎంపీడీవో అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ అందర్నీ సమన్వయం చేసుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతామని ఎవరు నిలిచితపడకూడదని సర్ది చెప్పారు. ఈ సమావేశంలో ప్రత్యేక అధికారి కృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి,  ఎంపీవో జైపాల్రెడ్డితో సర్పంచ్ లు వెంకటేష్ నాయక్,  కవిత శివ నాయక్, తదితరులు పాల్గొన్నారు.