తెలంగాణలోనూ పశ్చిమ బెంగాల్ లాంటి ఫలితాలు
విజయోత్సవ సంబరాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, మే 4 (విజయక్రాంతి) :ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని దీనికి తాజాగా ఐదు రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాల్లో బీజేపీ 3 రాష్ట్రల్లో గెలుపే నిదర్శమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపొందడంతో పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట టపాసులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. బీజేపీకి.. ప్రధాన మంత్రికి అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయ ఢంకా మోగించిందన్నారు.
పశ్చిమ బెంగాల్లో లో అత్యధిక స్థానాలు రావడం అక్కడి ప్రజలు మమత బెనర్జీ ని ఎంతగా వ్యతిరేకించారో అర్థం అవుతుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. ప్రస్తుత ప్రజల తీర్పే రాబోయే రోజుల్లో తెలంగాణలో రానుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచే బీజేపీ కార్యకర్తలు గ్రామగ్రామాన పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపు నిచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా ప్రణాళిక బద్ధంగా పని చేయాలని సూచించారు. పశ్చిమ బెంగాల్లో గెలుపును అందించిన అక్కడి ప్రజలకు ధన్యవాదలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, నాయకులు లాలా మున్నా, జోగు రవి, దినేష్ మాటోలియా, ఘటిక క్రాంతి, సుమన్ బాయి, మయూర్ చంద్ర, కృష్ణ యాదవ్, శ్రీకాంత్, ఉదయ్, సూర్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు.






