5 May, 2026 | 1:46 AM

బీజేపీ నాయకుల సంబురాలు

05-05-2026 12:24 AM

మునిపల్లి, మే 4: మునిపల్లి మండలంలో బీజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్ఛేరిలో బీజేపీ ఘనవిజయం సాధించిన సందర్బంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు అంకల శేఖర్ ఆధ్వర్యంలో మండలంలో పలు గ్రామాల్లో సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణి చేశారు. మండల అధ్యక్షుడు నాగశెట్టి  మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకున్నారని, మమతా బెనర్జీ అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు బీజేపీని గెలిపించారని  అన్నారు.  బెంగాల్లో బీజేపీ చరిత్ర సృష్టించిందన్నారు. ఊహించిన దానికంటే భారీ సీట్లు కైవసం చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు.