26 June, 2026 | 2:45 PM

రాజకీయ సన్యాసం తీసుకుంటా.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

26-06-2026 02:10 PM

పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ(Pargi Assembly constituency) బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జనరల్ బాడీ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) హాజరయ్యారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ...  డిసెంబర్ 9న రుణమాఫీ(Loan Waiver) చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రతి పంటకు బోనస్ ఇస్తానని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. రూ. 15 వేలు రైతబంధు, విద్య భరోసా కార్డు ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఫీజు రీయింబర్స్ మెంట్(Fee Reimbursement)ను బొందపెట్టారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కొత్తగా తెచ్చింది ఏమీ లేదని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) విమర్శించారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామన్నారు.. కోటి మంది మహిళలను కోటీశ్వర్లు కాదు.. లక్షాధికారులను చేయండి చాలు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మహిళలకు నెలలకు రూ. 2500 ఇస్తామన్నారు.. ఇవ్వలేదన్నారు. తెలంగాణలోని 1.67 కోట్ల ఆడ కూతుర్ల ఖాతాలో రూ.1.50 లక్షలు రేవంత్ రెడ్డి వేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ కేటీఆర్ సవాల్(KTR's Challenge) చేశారు. పరిగి పర్యటనలో కేటీఆర్ ఎస్ఐఆర్ పై పరిగి నేతలకు దిశానిర్దేశం చేశారు.