మండాలపాడు గ్రామ పంచాయతీలో SIR కార్యక్రమం
పెనుబల్లి. జూన్ 26, (విజయక్రాంతి): మండాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే ( ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ గాయం రమేష్ బి ఎల్ ఓ.లతో కలిసి ఎస్ ఐ ఆర్ ఫారమ్‌లను ఓటర్లకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాయం రమేష్ మాట్లాడుతూ, ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటర్ల జాబితాలో సక్రమంగా నమోదై ఉండేలా ప్రత్యేక సమగ్ర సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు.
పంచాయతీ సెక్రటరీ, బి ఎల్ ఓ.ఆఫీసర్ టి. నాగేంద్ర బాబు మాట్లాడుతూ, ఎస్ ఐ ఆర్. ఫారమ్‌ల నింపడంలో ఎటువంటి సందేహాలు ఉన్నా బి ఎల్ ఓ.లను సంప్రదించాలని, ప్రతి ఇంటికీ చేరుకుని పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తున్నామని గ్రామంలోని ప్రతి ఓటరు ఈ సర్వే ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఓటర్లు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






